Loading...

Thursday, 8 October 2015

తెలుగు దేశం పార్టీ ( టీడీపీ)కి రేవంత్ షాకిస్తారా?

టీడీపీకి రేవంత్ రెడ్డి షాకిస్తారా?

తెలంగాణ TDPలో కీలక నాయకుడిగా మారిపోయిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఆ పార్టీకి (TDP)షాక్ ఇస్తారా? రేవంత్ రెడ్డి భవిష్యత్ నిర్ణయం చంద్రబాబును కూడా షాక్ కు గురిచేయబోతోందా? అవును అన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. దీనికి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్న వాదనా ఉంది. ఇటీవల చంద్రబాబు రేవంత్కి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ గా  బాధ్యతలు ఇచ్చారు. అయితే తనకు అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు నిర్ణయంపై లోలోన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే దీనికి తోడు కొందరు సీనియర్ నేతలు మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన మాజీ TDP నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొస్తున్నారన్న ప్రచారం జోరుగా  జరుగుతుంది .ఇది కూడా రేవంత్ రెడ్డికి నచ్చడం లేదంటున్నారు. ఇదంతా పార్టీలో తనంటే గిట్టని కొందరు నేతల పనేనని రేవంత్ రెడ్డి  భావిస్తున్నారట. ఒకవేళ నాగం  జనార్దన్ రెడ్డి టీడీపీలోకి తిరిగి వస్తే తనదారి తాను చూసుకోవాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. అటు కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు కూడా రేవంత్ రెడ్డి  రాకకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు రెడీ అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టి లోని కీలక నేతలతో  రేవంత్ రెడ్డి  సన్నిహిత సంబంధాలున్నాయి . ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కావడం కూడా రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లోనే తనకున్న పరిచయాలతో  రేవంత్ రెడ్డి  తన నియోజకవర్గానికి భారీగా మొత్తంలో నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి  మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడని  సమాచారం.

0 comments:

Post a Comment

Loading...