Loading...

Friday, 30 October 2015

Folk Singer Madhu Priya Love Marriage Turns Controversial

Madhu Priya Love Marriage Turns Controversial సంచ‌ల‌నంగా మారిన సింగర్ మ‌ధుప్రియ పెళ్లి !!


సంచ‌ల‌నంగా మారిన సింగర్ మ‌ధుప్రియ పెళ్లి !! 



సింగర్‌ మధు ప్రియ ప్రేమ వ్యవహారం వివాదాస్పదం అయింది. మధు ప్రియ పెళ్లి జరిపించాలంటూ ప్రియుడితో కలిసి ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ పెళ్ళికి మధు ప్రియ వాళ్ళ  తల్లిదండ్రులు, బంధువుల అంగీకరించలేదు. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు  కాగజ్‌నగర్‌ వెళ్లి... ఇప్పుడే పెళ్లి వద్దంటూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మధుప్రియ అంగీకరించలేదు.  తమకు  పెళ్లి జరిపించాలని పోలీసుల్ని కోరగా... ఇద్దరి కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మధుప్రియ శ్రీకాంత్ లు ఇద్దరు  మేజర్లే అయినందున అలోచించి నిర్ణయం తిసుకోవ్వ్వలన్నారు.

ప్రియుడు శ్రీకాంత్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండగా... మధుప్రియ ఇంటర్మీడియట్  పూర్తి చేసింది. వీరి ప్రేమకు శ్రీకాంత్‌ వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించినా... మధుప్రియ కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించకపోవడంతో వారు పెళ్లికి సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితం ఇద్దరు కలిసి కాగజ్‌ నగర్‌ వచ్చి ఈరోజు ప్రియుడు  శ్రీకాంత్‌ ఇంట్లో పెళ్లికి చేసుకోవడానికి రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న మధుప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే మధుప్రియ భవిష్యత్‌ను దెబ్బతింటుందని, మధు భవిష్యత్తు దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . 

హైదరాబాద్‌ నల్లకుంటలో నివాసం ఉంటున్న మధు ప్రియ, శ్రీకాంత్‌లు రెండు సంవత్సరాలుగా  ప్రేమించుకుంటున్నారు. 2  నెలల క్రితమే మధుప్రియ  మేజర్‌ కావడంతో పెళ్లికి రెడీ అయ్యారు .

0 comments:

Post a Comment

Loading...