Breaking News
Loading...

Lady Constable gangraped by policemen in UP

Share on Google Plus


పోలీస్ వాహనంలో మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం

woman constable gangraped by policemen in UP

















సాధారణ మహిళలకే కాదు దేశంలో మహిళా పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది . అది కూడా సాక్ష్యాత్తు వాళ్ళ తోటి పోలీసుల చేతుల్లోనే మహిళా కానిస్టేబుల్ సామూహిక అత్యాచారానికి  గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ ఇటావాలోని ఝాన్సీలో ఈ ఘటన  జరిగింది. దీనిపై బాధిత మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళా కానిస్టేబుల్  స్థానికంగా నిర్వహిస్తోన్న ఓ మేళాలో పాల్గొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఖాకీ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు, మరో వ్యక్తి కలిసి బెదిరించి పోలీసు వాహనంలో ఎక్కించారని, మత్తు పదార్థం కలిపిన డ్రింక్ తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధిత మహిళా కానిస్టేబుల్  తెలిపింది. అనంతరం రోడ్డుపై విసిరేసి వెళ్లినట్లు తెలిపింది . దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేమ్ ప్లేట్ ఆధారంగా నిందితులు  అజయ్ యాదవ్, రాజ భాయ్ , మరొకరు డ్రైవర్ గా ఆమె గుర్తించినట్లు సమాచారం.


You Might Also Like

0 comments