Loading...

Monday, 7 March 2016

Naga Chaitanya To Romance With Samantha Once Again

once again Samantha to pair up with Naga Chaitanya, Naga chaithanya samantha combination once again


ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీ వెంటే ఎందుకు పడ్డట్టు అని ఏం మాయ చేసావేసినిమాలో తనని తానే ప్రశ్నించుకుంటాడు నాగ చైతన్య. కానీ ఇతగాడి వరుస చూస్తోంటే పరిశ్రమలో ఇంతమంది హీరోయిన్లుండగా నాగ చైతన్య సమంత వెంటే ఎందుకు పడుతున్నట్టు..? ఇప్పటికే నాగ చైతు, సమంతలు  " ఏం మాయ చేశావే ", "ఆటోనగర్ సూర్య", "మనం" సినిమాల్లో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇప్పుడు తాజాగా మరో సినిమా కోసం చైతు, సమంత జతకడుతున్నట్టు సిని  వర్గాలు అంటున్నాయి. నాగ్  హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనాసినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున కూడా ధృవీకరించారు. అయితే ఈ సినిమాలో చైతూ సరసన సమంత అయితే బాగుంటుందని మంతనాలు జరుగుతున్నాయట. ఏడాది కాలంగా టాలీవుడ్ కి  దూరంగా ఉంటోన్న సమంత దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం చైతూ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రేమమ్సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయనున్నాడట. నాగ్  నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్తున్నట్లు సమాచారం .

0 comments:

Post a Comment

Loading...